సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2019 (19:10 IST)

భార్య పెట్టిన బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమె వెంట్రుక వచ్చిందని భర్త ఏం చేశాడో తెలుసా?

పాపం... ఈరోజుల్లో గృహిణుల పరిస్థితి ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని... ఇంకా ఇవన్నీ చేసేసరికి వళ్లంతా హూనమై పోతోంది. అయినప్పటికీ భర్త-పిల్లలకీ ఓపిగా అన్నీ చేసి పెడుతూ వుంటుంది. ఇలా చేసేటపుడు వంటింట్లో, ఇంటి పనుల్లో ఎన్నో గాయాలు అవుతుంటాయి. ఆ గాయాలు గురించి చెబితే భర్తలు చాలా లైట్‌గా తీసుకుంటూ వుంటారు.
 
ఐతే తమ విషయంలో ఏదైనా చిన్న తప్పు భార్య చేసిందంటే ఇక వారి ఆగ్రహానికి అంతే వుండదు. ఇలాంటి సంఘటనే ఒకటి బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఉదయాన్నే భర్తకు ఓ భార్య అల్పాహారం పెట్టగా అందులో పొరబాటును ఆమె వెంట్రుక పడింది. అంతే.. దాన్ని చూసిన భర్త అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నానా రచ్చ చేయడమే కాకుండా పదునైన బ్లేడు తీసుకుని భార్యకు గుండు కొట్టేశాడు. 
 
ఈ ఘటన బంగ్లాదేశ్‌ని జోయపుర్హట్‌ జిల్లాలో జరిగింది. బాబుల్‌ మండల్‌ అనే వ్యక్తి తన భార్యను బ్రేక్ ఫాస్ట్ చేసి తీసుకురావాలని అన్నాడు. ఆమె హడావుడిగా చేసి పట్టుకొచ్చేటపుడు పొరబాటును ఆమె వెంట్రుక ఒకటి అందులో పడింది. దీనికి ఆమె భర్త అలా ప్రవర్తించాడు.