సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:41 IST)

విత్తమంత్రి నిర్మలమ్మ బడ్జెట్ - ఏది వస్తువు చౌక.. ఏది ఖరీదు!!

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.39.45 లక్షల కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తుంది. వేతన జీవులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా, అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థను ప్రైవేటుపరం చేసే చర్యల్లోభాగంగా, పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని నిర్ణయించింది. 
 
అయితే, ఈ బడ్జెట్ తర్వాత దేశ వ్యాప్తంగా ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులను పరిశీలిస్తే... కొత్త ఆర్థిక సంవత్సరంలో వస్త్రాలు, రత్నాలు, వజ్రాలు, అలంకరణ ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, స్టీల్ స్క్రాప్‌పై రాయితీ కస్టమ్స్ సుంకాన్ని ఒక యేడాది పొడగింపు వంటివి చోటు చేసుకున్నాయి. 
 
అలాగే, మరింత ఖరీదు కానున్న ధరలను పరిశీలిస్తే, అన్ని దిగుమతి వస్తువులు, గొడుగులపై  సుంకం పెరుగుదల, క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నుపోటు వంటిని కీలకంగా చెప్పుకోవచ్చు.