బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:17 IST)

పీఠాపురంలో నలుగురు బాలికల అదృశ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన విద్యార్థినులంతా పదో తరగతి చదువుతున్నారు. 
 
గత నెల 30వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. అలాగే, శనివారం తెల్లవారుజామున నుంచి మరో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు.
 
అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాగాలోదని వారి తల్లిదండ్రుల సమక్షమంలోనే పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు మందలించారు కూడా. ఈ పరిస్థితుల్లో వారు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. బాధిత విద్యార్థినిలు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.