లేటు వయస్సులో గేట్ ర్యాంకు!
లేటు వయస్సులో గేట్ ర్యాంకును సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి. ఆయన వయసు ప్రస్తుతం 64. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం జేఎన్టీయూలో ఎంటెక్ చేశారు.
గేట్ పరీక్షలో ఏకంగా జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లపాటు సేవలందించిన సత్యనారాయణ.. డీఈఈగా 2018లో రిటైర్మెంట్ తీసుకున్నారు.
2019లో జేఎన్టీయూలో సివిల్ డిపార్టుమెంటులో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ ఎగ్జామ్ లోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు.