ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:20 IST)

ఎపిలో 7,956 కరోనా కేసులు

ఎపిలో కరోనా రోజురోజుకి ఉధృతమౌతోంది. గడిచిన 24 గంటల్లో 7,956 కరోనా కేసులు నమోదవగా, అదే సమయంలో 60 మంది కరోనాతో మరణించారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కి చేరినట్లు రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 4,972కి పెరిగింది. యాక్టివ్‌ కేసులు 93,204 కాగా, 4,76,903 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో 61,529 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎపిలో 46,61,355 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్‌ తెలిపింది.