బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:28 IST)

కరోనా వైరస్ నుంచి కోలుకున్న 85 యేళ్ళ భామ ... కానీ, ఆమె కుమారుడు...

అనంతపురం జిల్లాలో హిందూపురంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ బారిన 85 యేళ్ళ వృద్ధురాలు తిరిగి కోలుకున్నారు. కానీ, ఈ వైరస్ బారినపడిన ఆమె కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ఇంటి విషాదంతో నెలకొంది. 
 
హిందూపురంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతని ద్వారా అతని అమ్మకు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరిని అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, పూర్తి చికిత్స తర్వాత 85 యేళ్ళ వృద్ధురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కానీ, ఆ వృద్ధురాలి కుమారుడు మాత్రం ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై వారికి చికిత్స చేసిన వైద్యుడు స్పందిస్తూ, కరోనా వైరస్ బారినపడిన వృద్ధులు కోలుకోవడం అరుదైన విషయమని చెప్పుకొచ్చారు.