శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 16 మే 2019 (19:53 IST)

పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ, బీసీ కాలనీలో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదన్న కారణంతో కన్న తల్లితండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కర్కోటకుడు. స్థానికంగా కూలి పనులకెళ్ళే ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలని తల్లితండ్రులను డబ్బులు అడిగాడు.
 
వారు డబ్బులు లేవని చెప్పటంతో బయటకు వెళ్ళి మద్యం సేవించి వచ్చి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు బెదిరించాడు. దీంతో వారించేందుకు దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులపై కిరోసిన్ పడింది. ఈ సమయంలో ప్రసాద్ అగ్గిపుల్ల వెలిగించటంతో తల్లిదండ్రులు గాలయ్య, లక్ష్మిలు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం రిమ్స్‌కు తరలించారు.