శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (15:09 IST)

విమానంలో ఎక్కారు, పక్కన కూర్చున్నారు, వైరస్ అంటించారు, ఎక్కడ?

ఏ పాపం ఎరుగని కొంతమంది అనవసరంగా కరోనా బారిన పడుతున్నారు. చివరకు క్వారంటైన్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చిన వారు చాలామందికి పాజిటివ్ వస్తే చివరకు వారి వల్ల మరికొంతమంది వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్నారు.
 
అందులో చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన యువకుడు కూడా ఉన్నాడు. ఢిల్లీలో పనిచేసే ఒక యువకుడు లాక్ డౌన్ నేపథ్యంలో గత నెల 18వ తేదీ విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరాడు. విమానంలో అతనితో పాటు ప్రయాణించారు జమాత్ మసీదులో ప్రార్థనలు చేసిన ముస్లింలు. 
 
అందరూ ముస్లింలు కావడం.. తెలుగు కూడా మాట్లాడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అనుకుని వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ యువకుడు. అలా పక్క సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మాట మాట కలుపుతూ చివరకు వైరస్ అంటించుకున్నాడు. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిశాడు.
 
ఏడురోజుల పాటు రేణిగుంటలో తిరిగాడు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు పరీక్షలు చేయించుకోండని చెప్పడంతో ఎందుకో అనుమానం వచ్చిన యువకుడు నేరుగా రుయా ఆసుపత్రికి వెళ్ళాడు. రక్తపరీక్షలు చేయించుకున్నాడు. అతనే ఆశ్చర్యపోయే విధంగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. 
 
వెంటనే తాను ఎక్కడెక్కడ తిరిగాడో.. ఎవరిని కలిశాడో అందరి గురించి చెప్పాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరినీ క్వారంటైన్‌లోకి తీసుకొచ్చారు ప్రభుత్వ అధికారులు. విమానంలో ప్రయాణించి ప్రార్థనలు చేసిన వారితో మాట్లాడినందుకు తనకు వైరస్ వచ్చిందని బాధపడుతూ వైద్య సిబ్బందికి చెప్పాడట ఆ యువకుడు.