శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (12:29 IST)

పంట పొలాల్లో చార్టెడ్ ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ చిన్నపాటి విమానం ఒకటి పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ విమానం ల్యాండ్ అయింది. 
 
నింగిలో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలటు గుర్తించాడు. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు సమీపంలో ఎక్కడా విమానాశ్రయం లేదని గ్రహించిన పైలెట్... బ్రహ్మసముద్రం మండలం ఎరడికెరాలో విమానం పొలాల్లో దిగింది. 
 
ఈ విమానం కర్ణాటకకు చెందిన ఓ ఎంఎన్సీదిగా గుర్తించారు. విమానం ల్యాండ్ అయిన ప్రాంతం చదునుగా ఉండటంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదని తెలుస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, విమానం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విమానం ఎమర్జెన్సీ మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.