శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2019 (14:28 IST)

మంగళగిరిలో ఆధార్ తిప్పలు... క్యూల్లో గంటల తరబడి...

మంగళగిరి పరిధిలో ఉన్న ఆధార్ కార్డులో మార్పులకు సంబంధించి అనేక మంది ప్రజలు గత కొన్ని రోజులుగా ఆధార్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కానీ అక్కడ సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రధానంగా పోస్ట్ ఆఫీసులో ఆధార్ కార్డు మార్పులుచేర్పులు చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సెంటర్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా స్పందించే నాధుడే కరువు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక కౌంటర్ లేకపోవడం, స్త్రీలకు వేరుగా లేకపోవడం... ఇలా చాలా ఇబ్బందులు సదరు ఆధార్ సెంటర్లలో ఉన్నాయి.
 
మరోవైపు కొందరు దళారులు ఇదే అదునుగా తమ పనులు పూర్తిచేసే ఆలోచనలకు పదును పెడుతు నగదు వసూళ్లకు దిగుతూ చేతికి అందినకాడికి మూటకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి తమకు న్యాయం చేయాలని ఆధార్ కార్డుదారులు కోరుతున్నారు. ఆధార్ సెంటర్లకు సరైన సదుపాయాలు కల్పించి సత్వరమే పరిష్కారం చేస్తే బాగుంటుంది.