గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (08:53 IST)

ఆగష్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరo ప్రారంభం : మంత్రి సురేష్

పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
 
కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
 
ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని,ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని,ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్
 
క్లాసులు నిర్వహించని నేపథ్యంలో 70 శాతం ఫీజులు తీసుకోవాలని ఆదేశించామని,రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సంవత్సరం ఫీజులు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. దాని ప్రకారం ప్రవేటు స్కూల్స్ లో ఫీజులు నిర్ణయిస్తామన్నారు.