శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:04 IST)

ఆస్పత్రిలో తెగిన లిఫ్ట్ వైర్... హోంమంత్రి చిన్నరాజప్పకు తప్పిన పెను ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిని పరామర్శించేందుకు వెళ్లినపుడు ఈ ప్రమాదం జరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిని పరామర్శించేందుకు వెళ్లినపుడు ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆ యువతిని పరామర్శించి వెళుతుండగా, లిఫ్టు వైరు తెగిపోయింది. ఆసమయంలో లిఫ్ట్‌లో ఉన్న డిప్యూటీ సీఎం చినరాజప్పసహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చినరాజప్ప నడుముకు గాయమైంది. వెంటనే స్పందించిన హాస్పటల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. పెద్దప్రమాదం తప్పడంతో మంత్రి అనుచరులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.