పెండింగ్‌లో ఉన్న అర్జీల విడుదలకు చర్యలు చేపట్టాలి: విజయవాడ మున్సిపల్ కమిషనర్
విజయవాడ నగర పర్యటనలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గుణదల, ప్రశాంతినగర్ నందు పర్యటించారు. ఈ సందర్భంగా మార్ట్‌గేజ్ విడుదల కోసం వచ్చిన అర్జిదారుని భవన నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంలో ఎల్.ఆర్.ఎస్ స్కీమ్ ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
ఆయా ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్ పారుదల విధానం పరిశీలిస్తూ, నివాసాల వారు తడి, పొడి చెత్తను వేరుగా అందజేస్తుంది.. లేనిది పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకొన్నారు.
అలాగే కృష్ణలంక డ్రెయిన్ పంపింగ్ స్టేషన్ ప్రాంతంలోని నిర్మల శిశుభవనం వద్ద మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ పరిశీలించి ఎల్ అండ్ టి వారితో చర్చించి డ్రెయిన్‌పై స్లాబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పర్యటనలో బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ ఎన్.గిరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై.వి.కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.