శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (20:24 IST)

జాతీయ స్థాయి యువ పార్లమెంట్‌కు హాజరైన ముగ్గురు బాలికలు

కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంద్రప్రదేశ్ గుంటూరు వారిచే నిర్వహించిన రాష్ట్ర స్థాయి జాతీయ యువ పార్లమెంట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక కాబడి ఈ నెల 11, 12 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ నందు నిర్వహించిన జాతీయ యువ పార్లమెంట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిలుగా పాల్గొన్న కుమారి జాలాది రిషిత (విజయవాడ), కుమారి ఎస్. కోమలి సాయి శివ రాణి(ఏలూరు), కుమారి డి. శ్రీలక్ష్మీ (కాకినాడ)లను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి నాగరాణి తమ కార్యాలయం నందు అభినందనలు అందచేశారు. 
 
మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందు ముందు మరిన్ని ఉన్నత స్థానాలు పొంది రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. యువత సామాజిక సేవా, యువజనోత్సవ కార్యక్రమల్లో భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్రం సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు రాచురి వెంకటేశం, జిల్లా యువ అధికారి సుంకర రాము, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.