ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:33 IST)

బిడ్డ తల్లితో అక్రమ సంబంధం.. పసివాడు అడ్డంగా ఉన్నాడని...

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. కొంతమంది క్షణాకావేశంలో హత్యలు చేస్తుంటే.. మరికొంతమంది గొడవలతో కుటుంబాలనే చిన్నాభిన్నం చేసేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే విశాఖపట్నంజిల్లాలో జరిగింది.
 
సింహాచలం సమీపంలో రెండేళ్ళ బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బిడ్డ తల్లితో శేఖర్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ఆ బాలుడు తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతన్ని ఎలాగైనా చంపేయాలనుకుని కిడ్నాప్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 
 
గత మూడునెలల నుంచి కాంతమ్మ అనే వివాహితతో శేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాంతమ్మ తన భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండడంతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమెను తన స్నేహితుడి ఇంటిలో ఉంచాడు శేఖర్. అయితే రెండేళ్ల చిన్నారి అభిరాం తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు.
 
ఆటోలో సింహాచలంకు తీసుకెళ్ళాడు శేఖర్. దర్శనం చేసుకున్న తరువాత కాంతమ్మను అక్కడే కూర్చోమని చెప్పి బిడ్డను తీసుకుని ఆటోలో వెళ్ళిపోయాడు శేఖర్. ఎంతకూ రాకపోవడంతో కాంతమ్మ అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయం కాస్త వైరల్‌గా మారడంతో శేఖర్ భయపడి చిన్నారిని ఏమీ చేయలేదు. పోలీసులు శేఖర్‌ను చాకచక్యంగా పట్టుకుని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి బిడ్డను అప్పజెప్పి పంపించేశారు.