ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (16:32 IST)

వెల్లంవల్లి డౌన్.. డౌన్... రాజీనామాకు పట్టు.. ఆటాడుకున్న రైతులు

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసనల సెగ తగిలింది. అమరావతి రైతులు ఈ నిరసనలకు దిగారు. గురుపౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వచ్చారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి అయ్యాక దేవాలయాలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించేందుకు యత్నించారు. 
 
అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినిస్టర్ డౌన్ డౌన్… వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోకముందే ఆందోళనకారులను పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టేశారు.