ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (12:35 IST)

తిరుమలలో జగన్ ఫోటో వున్న చొక్కా ధరించిన అంబటి రాంబాబు (video)

Ambati Rambabu
Ambati Rambabu
వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫోటో ఉన్న చొక్కా ధరించి తిరుమలలో హంగామా సృష్టించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు ఇతర విశ్వాస చిహ్నాలు, దేవతలు, వ్యక్తుల ఫోటోలు, రాజకీయ పార్టీల జెండాలు, నినాదాలు చేయకూడదు.
 
టిటిడిలో కొన్ని దశాబ్దాలుగా ఈ నిబంధన అమలులో ఉంది. అయితే అంబటి రాంబాబు శ్రీవారి ఆలయంలో జగన్ ఫోటో ఉన్న చొక్కా ధరించడంపై పలువురు విమర్శలు గుప్పించారు. ఆలయ సంప్రదాయాన్ని అంబటి ఉల్లంఘించారని.. తిరుమల సాంప్రదాయాన్ని గౌరవించాలని వారు తెలిపారు. 
 
ఇకపోతే.. తిరుమలకు విచ్చేసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. అంబటి రాంబాబుపై టీటీడీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతకు ఆలయ సంప్రదాయాలపై గౌరవం లేదని, ఆయన చర్య ఆమోదయోగ్యం కాదన్నారు.