శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (05:30 IST)

ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ

ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేశారు. 2021-22 నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వం ఇప్పటివరకు ఏడాది అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్నును లెక్కిస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆ మేరకు ఆస్తి పన్ను పెరగనుంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను 10 శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
 
కాగా, కొత్తగా సవరించిన మేరకు ధార్మిక, విద్య, వైద్య, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తి పన్ను మినహాయించారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు.

375 చదరపు అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తిపన్ను రూ.50గా నిర్ధారించారు. అంతేకాదు, భవన నిర్మాణ శైలి ఆధారంగా ఆస్తి విలువ ఖరారు చేయనున్నారు.
 
ఆర్ సీసీ, రేకులు, పెంకులు, నాపరాళ్లు, పూరిళ్లకు వర్గీకరణ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారించే క్రమంలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం జరిమానా విధించనున్నారు.