శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (12:04 IST)

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు.. యాదవ సంఘం

ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులు రానున్నాయని ఈ మేరకు తమకు ఆశాభావం ఉందని యాదవ సంఘం జిల్లా నేత ఓట్టూరు సంపత్ యాదవ్ పేర్కొన్నారు. 
 
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య శిష్యులు ఎప్పుడు కరోనా బాధితులకు సేవలు చేస్తూ అతి దగ్గరగా ఉండడం వల్ల ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి ఉంటుందన్నారు. దీనిని మీడియా చిలవలు పలవలు చేయవద్దన్నారు
.
ప్రతి 14 రోజులకు ఒకసారి ఆనందయ్య శిష్యులు ఆయుర్వేద మందు తీసుకుంటారని, ఇటీవల కాలంలో మందు అందక తీసుకోలేదన్నారు. కృష్ణపట్నంలో ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించరని.. ఇది ఆనందయ్య ఆయుర్వేద మందు పని తనానికి నిదర్శనమన్నారు.
 
సోమవారం ఆయూష్ తరుపున అన్ని అనుమతులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా, కరోనా బాధితులను భయాందోళనలకు గురిచేసేలా మీడియా ప్రచారం చేయొద్దని కోరారు.