ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (15:14 IST)

రోడ్డుపై పెట్రోల్ ... బీడీ వెలిగించి అగ్గిపుల్ల పడేసిన వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు? (Video)

fire
రోడ్డుపై పెట్రోల్ పడివుంది. ఈ విషయాన్ని గమనించని ఓ వ్యక్తి.. బీడీ వెలిగించి అగ్గిపుల్లను కిందపడేశాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆ పక్కనే ఉన్న ద్విచక్రవాహనాని కూడా అంటున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం - కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తి క్యానులో పెట్రోల్ తీసుకొని వెళ్తుండగా క్యాన్ కింద పడి.. పెట్రోల్ రోడ్‌పై పడి పోయింది. అయితే ఇది గమనించని ఒక వ్యక్తి బీడీ ముట్టించికొని అగ్గి పుల్ల రోడ్డుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని పక్కన ఉన్న బైక్‌లకు అంటుకున్నాయి. ఆ  వీడియోను చూడండి..