మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఒకే టిక్కెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం.. ఎక్కడ... ఎలా?

ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే టిక్కెట్‌‍పై రెండు బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. అంటే మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక బస్సు నుంచి ఇంకో బస్సులోకి మారేందుకు 2 నుంచి 20 గంటల వ్యవధి సమయాన్ని కేటాయించింది. తొలుత ఈ విధానాన్ని 137 రూట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తొలి సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ రికార్డులకెక్కనుంది. 
 
ఈ విధానం కింద టిక్కెట్ తీసుకునే ప్రయాణికుడు ఒక బస్సులో టిక్కెట్ తీసుకుని మరో బస్సులో కూడా తన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రయాణికుడు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి నేరుగా బస్సులు లేనపుడు మధ్యలో ఓ ప్రాంతంలో దిగి మరో బస్సులో ప్రయాణించి చేరాల్సిన చోటుకు చేరుకోవచ్చు. 
 
మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్‌లో భాగంగా రెండు బస్సుల్లో ప్రయాణికుడు రిజర్వేషన్ చార్జీ మాత్రం ఒకేసారి వసూలు చేస్తారు. ఈ విధానంలో ప్రయాణికుడు ఒక బస్సులో ప్రయాణించి మధ్యలో మరో ప్రాంతంలో దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకునే బస్సులో మారేందుకు 2 నుంచి 22 గంటల సమయం ఉంటుంది. ఈ విధానాన్ని తొలుత 137 మార్గాల్లో అమలు చేస్తారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కానీ, ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో ద్వారా కానీ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే దీన్ని ప్రారంభించనున్నారు.