ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:21 IST)

వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధం : ఆర్థిక మంత్రి

మార్చి నెలలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించి దేనికి ఎంత కేటాయించాలన్న విషయంపై స్పష్టతకు వచ్చేశామన్నారు.

మార్చి నెలలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించి దేనికి ఎంత కేటాయించాలన్న విషయంపై స్పష్టతకు వచ్చేశామన్నారు. అసెంబ్లీలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉంటే ప్రశాంత వాతావరణంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందన్న నమ్మకంతో కూడా మేము ఉన్నట్టు యనమల చెప్పారు.