ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (17:11 IST)

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర బంధం : భర్తను చంపేసి ప్రియుడితో జంప్!!

ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో పచ్చని కాపురంలో వివాహేతర బంధం చిచ్చుపెట్టింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను కాటికి పంపించింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఊరు వదిలిపారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మార్కాపురం పట్టణానికి చెందిన ఎల్లంగారి వెంకటేశ్వర్లు (32)కు ఆరేళ్ల కిందట అశ్విని అనే యువతితో పెళ్లి జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంతలో వారి మధ్యలో టి.దేవరాజ్‌ అనే యువకుడు ప్రవేశించాడు. 
 
అశ్వినితో స్నేహాన్ని పెంచుకుని, ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన భర్త వెంకటేశ్వర్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో నెల రోజుల క్రితం తన ప్రియుడు దేవరాజ్‌తో ఊరి నుంచి పారిపోయింది. తన భార్య కనపడట్లేదని  పోలీసులకు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు.
 
ఇటీవల అశ్విని, దేవరాజ్ తిరిగి ఊరికి వచ్చారు. తన భార్య అశ్వినితో గొడవ పెట్టుకున్న వెంకటేశ్ ఆమెతో కలిసి దేవరాజ్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ ముగ్గురు గొడవపడ్డారు. దీంతో ప్రియుడు దేవరాజ్‌తో కలిసి అశ్విని వెంకటేశ్వర్లుపై దాడి చేయటంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దేవరాజుతో అశ్విని మళ్లీ పారిపోయింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.