శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (17:52 IST)

ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజే 90 మంది మృత్యువాత

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,690 మందికి పరీక్షలు నిర్వహించగా 8,976 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఒక్క రోజే కరోనాతో 90 మంది మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో ప్రస్తతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడచిన 24 గంటల్లో 13,568 కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 
 
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 1,97,91,721 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆది వారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.