Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మీడియా పాయింట్ జర్నలిస్టులను అడ్డుకున్న మార్షల్స్

Written By ఠాగూర్
Updated: సోమవారం, 9 డిశెంబరు 2019 (15:29 IST)
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ మార్షల్స్ జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మార్షల్స్ దురుసు ప్రవర్తన వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కలుగజేసుకోవడంతో సద్దుమణిగింది. 
 
మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్ళనియకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరో మార్గంలో చుట్టూ తిరిగి రావాలని మార్షల్ అదేశాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. చీఫ్ మార్షల్ వచ్చే సమయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అటుగా రావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 
 
ఐఎండీపీఆర్ డీడీ చొరవతో అడ్డుపెట్టిన భారీ తాడు అడ్డు తీసి దారి వదిలారు. అసెంబ్లీ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీతో మాట్లాడి మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా చూస్తానని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

అన్నీ చూడండి

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments