లోకేష్‌ను విమర్శించిన పవన్.. మోదీ చేతిలో కీలుబొమ్మ: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు జనసేనాని చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు నారా లోకేష్ చదువుకుని.. ఓ కంపెనీని కూడా నిర్వహిస్తున్నాడన్నారు. ప్రజా సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని.. డబ్బ
ఏపీ సీఎం చంద్రబాబు జనసేనాని చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు నారా లోకేష్ చదువుకుని.. ఓ కంపెనీని కూడా నిర్వహిస్తున్నాడన్నారు. ప్రజా సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని.. డబ్బు కోసం నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లోకేష్‌కు లేదన్నారు.
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులకు చెప్పారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆస్తిపాస్తుల వివరాలను ప్రతి సంవత్సరమూ పారదర్శకంగా మీడియా ముందు బహిర్గతం చేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాలేదనే ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామనే విషయాన్ని చెప్పలేదని చంద్రబాబు అన్నారు. వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారో పవన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. హోదాను ఇవ్వని నరేంద్ర మోదీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని చంద్రబాబు సంశయం వ్యక్తం చేశారు.