సెంటిమెంట్ కోసం డబ్బులివ్వరా? చట్టాలు మాకే కానీ.. మీకు కాదా?: పవన్ (LIVE)
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గుంటూరులో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఆంగ్లంలో ఎండగ
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గుంటూరులో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఆంగ్లంలో ఎండగట్టారు. సెంటిమెంట్ కోసం డబ్బులివ్వలేమని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై పవన్ మండిపడ్డారు. సెంటిమెంట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం అంటే తనకు భయం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్రం ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసి.. మమ్మల్ని రగిల్చిందని పవన్ అడిగారు. తెలుగువారు టంగుటూరి ప్రకాశం వారసులని, వారికి ఎలాంటి భయం లేదని అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి వినపడేలా ప్రశ్నిద్దామని పవన్ పిలుపు నిచ్చారు.
అరుణ్ జైట్లీ ఇంతకుముందు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోనప్పుడు మీ చట్టాలను మేమెందుకు పాటించాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఆంధ్రుల గుండెల్ని పిండేస్తోందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంటులో ఇచ్చిన మాట తప్పుతారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.