శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 మార్చి 2018 (21:21 IST)

యువత త్యాగాలను స్మరిస్తూ జనసేన గీతం(వీడియో)

స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి యువత చేస్తున్న త్యాగాలను... బలిదానాలను స్మరించుకొంటూ వారికి నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ గీతాన్ని రూపొందించింది. సోమవారం సాయంత్రం ఈ గీతాన్ని పార్టీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 'ఇంకెన్ని..' అంటూ సాగుతుందీ గీతం. త

స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి యువత చేస్తున్న త్యాగాలను... బలిదానాలను స్మరించుకొంటూ వారికి నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ గీతాన్ని రూపొందించింది. సోమవారం సాయంత్రం ఈ గీతాన్ని పార్టీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 'ఇంకెన్ని..' అంటూ సాగుతుందీ గీతం. తెల్లవారితో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించడంలో యువశక్తి పాత్ర అనిర్వచనీయమైనది. పోరాడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యంలో విలువలు క్షీణిస్తున్నాయి.
 
విధానాలు లోపభూయిష్టంగా తయారయ్యాయి. రెండు తెలుగు ప్రాంతాలవాళ్ళు రాష్ట్రాలు కావాలని జై తెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలు చేస్తే కలిపి ఉంచారు. పాలక వర్గాలు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఉద్యమాలు, పోరాటాల్లో యువత బలైపోతోంది. వారి ప్రాణ త్యాగాలకు ఇస్తున్న విలువ ఏమిటి? వారు అర్పించిన ప్రాణాలే కాదు... వారిపై ఆధారపడ్డ బతుకుల్నీ గుర్తుచేసుకొంటున్నామా? అవకాశవాద రాజకీయాలకి బలైపోతూ మోసపోతున్న యువతని స్మరించుకొంటూ... వారి త్యాగాలకు ఈ గీతం ద్వారా  జనసేన నివాళులు అర్పిస్తోంది. ఈ గీతానికి ప్రత్యేకంగా  వీడియో కూడా రూపొందించారు. చూడండి ఆ వీడియోను...