మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (14:20 IST)

మా నాన్న సీఎం కాదు.. జగన్ వెనుక మోదీ వున్నారా?: పవన్ కల్యాణ్

తాను భావితరాల కోసమే రాజకీయాల్లో అడుగుపెట్టానని.. సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోనని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని కాజాలో సొంతింటికి శంకుస్థాపన చేసిన చేసిన పవన్ అనంతరం మీడియాతో మా

తాను భావితరాల కోసమే రాజకీయాల్లో అడుగుపెట్టానని.. సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోనని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని కాజాలో సొంతింటికి శంకుస్థాపన చేసిన చేసిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరిపై అవగాహన వుందని.. వారందరికీ 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభలో బలమైన దిశానిర్దేశం చేస్తానని పవన్ చెప్పారు. తాను భావితరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోనని స్పష్టం చేశారు. మిగతా వారి లాగా తనకు రాజకీయ నేపథ్యంలో లేదని.. మా నాన్న సీఎం కాదని సెటైర్లు విసిరారు. 
 
వీటన్నింటిని అధిగమించి ఎదగడానికి కావలసిన సహనం తనకు ఉందని చెప్పారు. ఇక మిమ్మల్ని ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు. టీడీపీనే నా వెనుక వుందని ఎందుకనుకోవాలి. బీజేపీని అనుకోవచ్చు కదా? అంటూ సెటైర్లు విసిరారు. అలాగే జగన్ వెనుక మోదీ వున్నారని అందరూ అనుకోవచ్చుగా అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. ఇక పార్టీ పరంగా తదుపరి ప్రణాళికలను కూడా 14వ తేది స్పష్టం చేస్తానని.. తాను కష్టపడి ఆస్తులను కూడగట్టుకున్నానని.. అవసరమైతే ఆస్తులపై ప్రకటన చేస్తానని పవన్ క్లారిటీ ఇచ్చారు.