శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (16:44 IST)

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై సంపూర్ణ మద్దతు : పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటయ్యే మూడో కూటమికి సంపూర్ణ మద్దతిస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటయ్యే మూడో కూటమికి సంపూర్ణ మద్దతిస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకు మనస్ఫూర్తిగా తన మద్దతు తెలియజేస్తున్నానని తెలిపారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరపున తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగు ప్రజలపై ఆయనకున్న, ప్రేమాభిమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడారు. 
 
జాతీయ పార్టీల తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చి ఉంటే జనసేన పార్టీ పుట్టేదే కాదని అన్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోకపోతే థర్డ్ ఫ్రంట్ పుడుతుందని, థర్ఢ్ ఫ్రంట్ ఖచ్చితంగా ఉండాలన్నది తెలిపారు.