శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (17:25 IST)

థర్డ్ ఫ్రంట్‌కు మమతా బెనర్జీ మద్దతు : సీఎం కేసీఆర్

దేశంలో మూడో కూటమి అంటూ ఏర్పాటైతే దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌న

దేశంలో మూడో కూటమి అంటూ ఏర్పాటైతే దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని కలిసి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న తన ప్రకటనపై దేశవ్యాప్తంగా పలువురు స్పందించారని, దేశం నలుమూలల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, "పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాకు ఫోన్ చేశారు. దేశ రాజకీయాల్లో సంపూర్ణ మార్పు రావాల్సి ఉందన్న నా వాదనకు ఆమె మద్దతు ప్రకటించారు. నా వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కూడా ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో మరో కూటమి ఏర్పాటు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు పలికారు, కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు విఫలమైన విషయం ప్రజలకు అర్థమైంది. 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ కులమైనా, మతమైనా అందరం బాగుండాలి" అని వ్యాఖ్యానించారు.