శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (18:55 IST)

రాజధాని లేకుండా రాష్ట్రమిచ్చారు.. ఆంధ్రుల ఆవేదన ఏంటో చెప్తా: పవన్

జనసేన ఆవిర్భావోత్సవ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరుగుతోంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి (బుధవారం) నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ మహాసభకు భారీస్థాయి

జనసేన ఆవిర్భావోత్సవ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరుగుతోంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి (బుధవారం) నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ మహాసభకు భారీస్థాయిలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కార్యకర్తలు, అభిమానులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగం మొదలెట్టారు. 
 
భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ తెలిపారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీని పెట్టానని.. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదన ఏంటో ఈ సభ ద్వారా తెలియజేద్దామని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతున్నారు.  
 
ప్రజలకు అండగా వుండేందుకు జనసేన పుట్టుకొచ్చిందని పవన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంటే.. మనవారికి భయం, పిరికితనం. దోపిడి చేసేవారికే పిరికితనం వుంటుంది. అలాంటప్పుడు మనమెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడాలి అంటూ పవన్ ప్రశ్నించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. ప్రస్తుతం 25మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని.. 5 కోట్ల ప్రజలను నియంత్రించాలని కేంద్రం భావిస్తుందని పవన్ నిప్పులు చెరిగారు.