ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (19:30 IST)

జగన్ భక్తులుగా ముద్రపడిన అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్!

cmbabu
గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులుగా ముద్రపడిన అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారు తమ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకుంటే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు. 
 
కాగా, వరద సహాయక చర్యల్లో అలసత్యం ప్రదర్శిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అలవాటైన అలసత్వాన్ని వదిలించుకోవాలని లేకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 
 
అధికారుల తీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా ఉండాలన హితవు పలికారు. వరద సహాయక చర్యల్లో తానే స్వయంగా రంగంలోకి దిగానని, అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కావాల్సినంత ఆహారాన్ని తెప్పించినా దానిని పంపిణీ చేయడంలో జరిగిన జాప్యంపై మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం అధికారులతో సీఎం బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల వ్యవహారశైలి, అలసత్వంపై మండిపడ్డారు.