శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (18:06 IST)

కొత్త ప్రారంభానికి రష్మి గౌతమ్ రెడీ అవుతోంది, ఏమిటంటే...

Rashmi Gautham
Rashmi Gautham
యాంకర్, నటి రష్మి గౌతమ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ 1వ తేదీన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... సెప్టెంబర్ ప్రారంభమైంది. కొత్త ప్రారంభాలకు, కొత్త జ్నాపకాలను స్రిష్టించేందుకు.. అంటూ ఊరిస్తూ పేర్కొంది. దీనితో నెటిజన్లు ఆమె జీవితంలో ఎవరో ప్రవేశిస్తున్నారంటూ.. పెండ్లి ఎప్పుడు?  అంటూ తెగ రిప్లయిలు వస్తున్నాయి. అయితే వాటికి తనేమీ టెంప్ట్ కాకుండా నవ్వుతూ లైక్ చేస్తోంది. 
 
రష్మి కుటుంబంలో ఇటీవలే వారి తాతగారు మరణించారు. అప్పుడు ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత మరలా కొంత గేప్ తీసుకుని ఇలా పోస్ట్ పెట్టడంతో ఏదో శుభాకార్యం జరగబోతుందన్నట్లు హింట్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే జబర్ దస్త్ తోపాటు పలు టీవీ షోలలో బిజీగా వున్న రష్మిని అప్పుడప్పుడు ఇంకా ఎంతకాలం ఇక్కడ కూర్చొంటావ్.. అంటూ సరదాగా ఆమెపై కూడా సెటైర్లు వేస్తూ సీనియర్స్ స్కిట్స్ లు రాస్తుంటారు.