1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (17:23 IST)

ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను: సుడిగాలి సుధీర్

Sudheer Sudheer,  Dalisha
Sudheer Sudheer, Dalisha
సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, దర్శకుడు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘నాకు మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన అరుణ్ గారికి థాంక్స్. నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చింది. డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె నటిస్తూ ఉంటే ఎంతో కాంపిటేటివ్‌గా అనిపిస్తుంది. మా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా? అనుకుంటున్న టైంలోనే బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేశారు. మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేలా హెల్ప్ చేశారు. గెటప్ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.. మీ అభిమానం నాకు దక్కేది కాదు. వాళ్ల వల్లే మీ అభిమానం దొరికింది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేను. గాలోడు సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది.. ఇప్పుడు మంచి చిత్రాలు ఇస్తే ఇంకా ప్రేమిస్తారు అని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారు. ఇకపై కొత్త కంటెంట్, మంచి సినిమాలు తీస్తాను. కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండి’ అని అన్నారు.
 
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘కాలింగ్ సహస్ర సినిమాను నేను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చాను. డిసెంబర్ 1న రాబోతోన్నామని డేట్ వేశాం. మా సినిమాను నమ్మి భరత్ గారు ముందుకు వచ్చి ఆంధ్రాలోని అన్ని ఏరియాలను కొన్నారు. అలా అన్ని ఏరియాలు వెంటనే బిజినెస్ అయింది. మంచి థియేటర్లు దొరికాయి. డైరెక్టర్ అరుణ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు. అన్ని అంశాలు కలగలపి తీశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. డిసెంబర్ 1న మా సినిమాను చూసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ‘అరుణ్ విక్కిరాలకు సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది. సుధీర్ చక్కగా నటించారు. హీరోయిన్ డాలీషా అందంగా ఉన్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది.పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ‘సుధీర్ చాలా మంచి మనిషి. డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీని సుధీర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ విచ్చేసి చూడండి’ అని అన్నారు.
 
అరుణ్ విక్కిరాల మాట్లాడుతూ, జేడీ చక్రవర్తి అన్న వల్లే అమ్మ విలువ తెలుసుకున్నాను. మా నిర్మాత విజయ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చింది. రావణాసురుడిని సంహరించాకే రాముడు దేవుడయ్యాడు. సందర్భం వచ్చే వరకు ప్రతీ ఒక్కరూ సామాన్యులే. ఈ లైన్‌ను ఆధారం చేసుకునే ఈ మూవీని తీశాం. కెమెరామెన్ శశికిరణ్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు.  డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది అని అన్నారు.
 
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘సుధీర్ చాలా మొహమాటస్తుడు. చాలా మంచి వ్యక్తి. అరుణ్ విక్కిరాల చాలా పర్‌ఫెక్షనిస్ట్. చాలా డెడికేటెడ్ పర్సన్. ఆల్రెడీ గ్లింప్స్‌లో డాలీషాను చూశాను అద్భుతంగా అనిపించింది. అరుణ్ పర్‌ఫెక్షన్‌కు అమ్మాయిలు ఉండరు. కానీ సినిమాలు ఉంటాయి (నవ్వుతూ). డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ వీక్షించండ’ని అన్నారు.
 
డాలీషా మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్, రాజశేఖర్, వెంకటేష్ సర్‌కు థాంక్స్. గెస్టులుగా వచ్చిన జేడీ గారికి థాంక్స్. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మూడేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తూనే ఉన్నాం. కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది.  అయినా మా టీం అంతా ఎంతో పాజిటివిటీతో ఉన్నాం.