శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (09:44 IST)

నేను బయటికి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ గా రెడీ అవ్వలేను : యాంకర్ రష్మీ

Anchor Rashmi,
Anchor Rashmi,
హైదరాబాద్ లో అతిపెద్ద దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా  జరిగింది. నటి, యాంకర్ రష్మీ ముఖ్య అతిధిగా వచ్చి దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీని  ప్రారంభించారు. ఈ అకాడమీలో  మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్ కు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అనంతరం యాంకర్ రష్మీ మాట్లాడుతూ, వేణు అన్న చాలామంచి మేకప్ మెన్..ఈ అన్నతో  గత  10 సంవత్సరాలనుండి  అసోసియేట్ అయి ఉన్నాను.. 
 
అయితే దేనికైనా ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ను రియాలిటీ గా మార్చుకోవడమే వారి కల, ఇప్పుడు తను తీర్చుకున్న కల  రియాలిటీగా  మారిందే "దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ". ఈ రోజు తను ఓపెనింగ్ బిజీ లో ఉన్నా కూడా వచ్చి నాకు మేకప్ చేశాడు. అయితే ఈ అకాడమీ ఓపెనింగ్ మూడు సంవత్సరాల క్రితమే  జరగాలి. ప్యాండమిక్ వలన డిలే అయ్యింది.ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదైనా ఫంక్షన్ కు గానీ పార్టీ కు గానీ వెళ్ళేటప్పుడు మంచి శారీ  కట్టుకొని నీట్ గా అందంగా రెడీ అయి బయటికి రావాలని ట్రై చేస్తుంటారు.కానీ ఎదో ఒక లోపం ఉంటుంది. అంతెందుకు నేను కూడా బయటికి వెళ్ళాలి అంటే పర్ఫెక్ట్ గా రెడీ అవ్వలేను. కాబట్టి  అలాంటి వారందరికీ "దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ' లో మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్ వంటి వాటిపై పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తుందని అన్నారు.
 
అకాడమీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ..వేణు నాలుగు నెలల క్రితం నా దగ్గరికి వచ్చి తను ఇలా అకాడమీ పెట్టాలి అనుకొన్నాను అంటే నాకు నచ్చి ఒకే అన్నాను. దృశ్య అనే టైటిల్ కూడా నేనే సజెస్ చేశాను. వేణు ఈ రంగంలో మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నా ప్రాణం కాపాడింది.
 
మేకప్ మెన్ వేణు మాట్లాడుతూ.. మా అకాడమీ ని ప్రారంభించిన రష్మీ మేడమ్ కు ధన్యవాదములు. మేడమ్ దగ్గర నేను గత 10 సంవత్సరాలుగా మేకప్ చేస్తున్నాను. కరోనా టైం లో నేను ఎంతో ఇబ్బందుల్లో  ఉంటే నా ప్రాణం కాపాడింది. నేను తనను  వదిలి  వేరే దగ్గరికి వెళ్లలేనందున  నేను ఇలా అకాడమీ పెట్టుకుంటాను అని చెప్పగానే  తను వెంటనే ఓకే అని బ్లెస్సింగ్ ఇచ్చింది.అలాగే నా ప్రాణ స్నేహితుడు నా పార్ట్నర్ సబి  నన్ను  చేర్మెన్ సురేష్ గారికి పరిచయం చేయడంతో ఈ అకాడమీ కార్య రూపం  దాల్చింది.మా అకాడమీ లో వచ్చిన ప్రతి ఒక్కరికీ బెస్ట్ సర్వీస్ ఇస్తాము. అలాగే మా అకాడమీ వచ్చే  ప్రతి ఆమ్మాయి కూడా మా అకాడమీలో పర్ఫెక్ట్ గా వర్క్ నేర్చుకొని నెలకు 50,000 సంపాదించుకొనేలా చేస్తాము అన్నారు.