ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (18:04 IST)

అదనంగా ఏడాది పాటు అప్రెంటిస్‌ : సీఎం జగన్ ఆదేశాలు

ఏదోలా డిగ్రీ పూర్తిచేయడం కాకుండా అంతరాత్జీయ ప్రమాణాలకు అవసరమైన అత్యుత్తమ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌, బీఏ, బీకాం వీటన్నింటి పాఠ్యప్రణాళికను పునఃపరిశీలించేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
 
కాలేజీ నుంచి విద్యార్థి బయటకు రాగానే ఉద్యోగం, ఉపాధి పొందడమే లక్ష్యంగా పాఠ్యప్రణాళిక, శిక్షణ∙ఉండాలని సీఎం పునరుద్ఘాటించారు. దీనికోసం పాఠ్యప్రణాళికలో మార్పులు చేర్పులు తీసుకురావమే కాకుండా ఇప్పుడున్న కోర్సులకు అదనంగా మరో ఏడాది అప్రెంటిస్‌ చేయించాలని సీఎం నిర్ణయించారు. అప్రెంటిస్‌ చేశాక... అవసరమనుకుంటే మళ్లీ శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనిపై నెలరోజుల్లోగా ప్రణాళిక సిద్ధంకావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 
 
పాలనా పరంగా కీలక మార్పులు : 
ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివద్ధి శిక్షణ కార్యక్రమాలు, జాబ్‌మేళాల అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎవరు శిక్షణ ఇస్తున్నారు, శిక్షణ ఇస్తున్నవారిలో నాణ్యత ఉందా? లేదా? అన్నది పట్టించుకోవడంలేదని, దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని సీఎం పేర్కొన్నారు. జాబ్‌మేళాలు కూడా ఆశించినట్టుగా లేవన్నారు. ఒకటి రెండు నెలలు శిక్షణ ఇచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఏముంటుందని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్‌ఏసీ ( నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌)లో మాదిరిగా శిక్షణ ఉండాలన్నారు. 
 
ఇక ప్రభుత్వ శాఖలన్నీ ఈ కార్యక్రమాలకోసం విడివిడిగా ఖర్చు చేయడం నిలిపేయాలని ఆదేశాలు జారీచేశారు. నైపుణ్యాభివద్ధికోసం శిక్షణ, సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తున్న డబ్బు అంతా ఆర్థికశాఖ పరిధిలో ఉంటుందని, ఈ శాఖనుంచే నేరుగా డబ్బును ఖర్చుచేస్తామని సీఎం వెల్లడించారు. యూనివర్శిటీ ఏర్పాటు, కాలేజీల నిర్మాణం తదితర వాటికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని, దీనికోసం తదేక దష్టితో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అధికారులతో అన్నారు. 
 
పార్లమెంటు స్థానంలో కట్టాల్సిన నైపుణ్యాభివద్ధికాలేజీ ఏం కావాలి? ఎలా కావాలి? అన్నదానిపై ఆలోచనచేసి, ఆమేరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని, దీన్ని శాఖలు విడివిడిగా చేయలేవన్నారు. ప్రభుత్వ తరఫునుంచి నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలు, ఏర్పాటు చేయనున్న యూనివర్శిటీ, కాలేజీలు.. వీటన్నింటినీ కోసం ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నట్టు సీఎం వెల్లడించారు. మూడు నాలుగు రోజుల్లో నియామకం జరగాలన్నారు.