గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (14:09 IST)

ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదం.. పవన్ కల్యాణ్ (video)

Pawan kalyan
కృష్ణాజిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ముందు యువతకు ఉపాధి కల్పించాలన్నారు. 
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ తర్వాతే విందులు, వినోదాలు అని వ్యాఖ్యానించారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు.
 
సినిమాలలో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. అభిమానులు ఆ సినిమా 'ఓజీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో, పవన్ సినిమాల గురించి కాసేపు మాట్లాడారు. 
 
సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు.
 
గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియదని అన్నారు. తమది లంచాల ప్రభుత్వం కాదని, మంచి ప్రభుత్వమని చెప్పారు. పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు. పరిపాలన అనుభవం కావాలంటే ఎంతో కృషిచేయాలనని అన్నారు.