స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు
స్త్రీలకు కొన్నిసార్లు ఎడమవైపు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రారంభమవుతుంది. ఈ నొప్పి సాధారణమైనదైతే ఈ క్రింది చిట్కాలతో తగ్గిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
హీటింగ్ ప్యాడ్‌ని అప్లై చేయడం లేదా వెచ్చని స్నానం చేయడం వల్ల కండరాలకు విశ్రాంతి లభించి, నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
గోరువెచ్చిని నీరు లేదా గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియకు, కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందవచ్చు.
పిప్పరమింట్ టీ, అల్లం టీ లేదా చామంతి టీ తాగితే వికారం, జీర్ణ అసౌకర్యంతో పాటు గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది.
నొప్పితో వున్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను వదిలి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
స్పైసీ ఫుడ్, కొవ్వు లేదా అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా వుండాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నా ఫలితం వుంటుంది.
నొప్పి వున్న ప్రాంతంలో సున్నితమైన మసాజ్‌లు చేస్తుంటే ఉపశమనం కలుగుతుంది.
ఎడమ వైపు కడుపు నొప్పికి అనేక కారణాలుంటాయి, వీటిలో ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సమస్యలు వుండవచ్చు.
ఇంకా గ్యాస్ట్రిటిస్, స్టొమక్ అల్సర్, బైల్ రిఫ్లక్స్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్ సమస్యలు కావచ్చు.
గమనిక: ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్నిస్తాయి, కానీ నిరంతర లేదా తీవ్రమైన నొప్పి వుంటే వైద్యుడిని సంప్రదించాలి.