Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది
Home Remedies To Reduce Hair Fall, చాలామంది జుట్టు రాలే సమస్యతో సతమతం అవుతుంటారు. అలాంటివారు కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
పెద్ద ఉల్లిపాయ రసాన్ని కాటన్ బాల్‌తో తలకు రాస్తుంటే అందులోని సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను దృఢపరుస్తుంది.
గుడ్డులోని తెల్లసొనను చెంచా పెరుగుతో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే అది జుట్టు బలంగా వుండేట్లు చేస్తుంది.
కరివేపాకు తరిగిన పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే అది జుట్టు పెరుగుదలకో దోహదం చేస్తుంది.
తాజా కలబంద యొక్క జెల్‌తో తలపై మసాజ్ చేసినా జుట్టు కుదుళ్లు గట్టిగా వుంటాయి.
కొబ్బరి పాలతో మాడుపై మసాజ్ చేసి 10 నిమిషాలు తర్వాత కడిగేయాలి, ఇలా చేస్తే జుట్టు మృదువుగా మెరిసిపోతుంది.
తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడం, చిట్లడం తగ్గిస్తుంది.
కొత్త హెయిర్ ఫోలికల్స్‌ను రూపొందించడంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది కనుక ఈ విటమిన్ అందేట్లు చూడాలి.
అంతేకాదు థైరాయిడ్ వ్యాధి లేదా జుట్టు రాలడానికి దారితీసే ఇతర వైద్య పరిస్థితులేమైనా వున్నాయేమో చెక్ చేసుకోవాలి.
తగినంత కేలరీలు, ప్రోటీన్, ఇనుముతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వుండాలి.