బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:56 IST)

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

cinnamon
దాల్చిన చెక్క. ఈ మసాలా దినుసును పాలతో కలిపి తాగడం వల్ల రాత్రిపూట ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రను పొందేలా చూసే ఆరోగ్యానికి చురుకైన విధానంలో భాగమయ్యే పానీయం ఇది. దాల్చిన చెక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును తగ్గించాలనుకుంటే ఆహారాలలో దాల్చినచెక్కను జోడిస్తుండాలి.
దాల్చినచెక్క ఆకలిని అణచివేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క, శొంఠి, యాలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని అరచెంచా పొడిని పావు గ్లాసు నీటిలో కలిపి తాగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబూ, దగ్గు తగ్గుతాయి.
ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి, రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది.
దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.