ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2023 (21:34 IST)

దాల్చిన చెక్కకు అనారోగ్య సమస్యలు దాసోహం, అంతే

cinnamon
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
 
జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
 
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలపి పెట్టుకోవాలి.
అరచెంచా పొడిని పావు గ్లాసు నీరు లేదా పాలల్లో కలిపి తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
 
మొటిమలు సమస్య తగ్గేందుకు ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి.