సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 డిశెంబరు 2023 (20:42 IST)

అంజీరను పాలలో కలుపుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

అంజీర పండును పాలులో కలుపుకుని తింటుంటే బలహీనతను తొలగిస్తుంది. రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది.
 
యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది. అంజీర పాలులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది, ఇది రక్తహీనతను తొలగిస్తుంది.