బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 నవంబరు 2023 (11:04 IST)

కివి పండు తింటున్నారా? ఇందులో ఏమేమి ప్రయోజనాలు ఇమిడి వున్నాయి?

సీజనల్ ఫ్రూట్స్. సీజన్ కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు.
 
రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.