రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?
తులసి. ఈ మొక్క ఆధ్యాత్మికతలో ఎంతో పవిత్రమైనది. అలాగే ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలపై లేపనం చేస్తుంటే తగ్గుతాయి.
రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది.
జీర్ణాశయ దోషాలు, రక్తపోటు నియంత్రణ, పైత్య వికారాలు, నోటి దుర్వాసన తగ్గేందుకు తులసి మేలు చేస్తుంది.
వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగితే మలేరియా సోకకుండా రక్షణ కలుగుతుంది.
రోజుకోసారి 4 టీ స్పూన్ల తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే మూత్రపిండ, మూత్రకోశ, మూత్రశయాలలోని రాళ్లు కరుగుతాయి.
తులసిలో యూజీనాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజీనాల్ కాలేయంలో టాక్సిన్-ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది.
తులసిని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరేచనాలు కలుగుతాయి.
చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.