బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:43 IST)

వినియోగ‌దారులకు క‌రెంట్ షాక్! కొత్త టారీఫ్ ఇదిగో!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విద్యుత్ వినియోగ‌దారుల‌కు ఎల‌క్ట్రిసిటీ బోర్డు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఈ టారిఫ్ ని విడుద‌ల చేశారు. 
 
గృహ అవసరాలకు విద్యుత్ వాడే వారిని మూడు కేటగిరిలుగా విభజించారు. ఏ గ్రూప్ లో 75 యూనిట్ ల కంటే తక్కువ వినియోగదారుల‌కు యూనిట్ కి 0-50 రూ.1.45 చార్జి చేస్తారు. 51-75 యూనిట్ లకు రూ.2.60, బి గ్రూప్ లో 75 నుంచి 225 యూనిట్ల వినియోగం 101-200 రూ.3.60, 201-225 రూ.6.90 చార్జి చేస్తారు.

సి గ్రూప్ కింద 225 యూనిట్ల పైబడిన వినియోగదారులుంటారు. వారికి 0-50 రూ.2.65, 51-100 రూ.3.35, 101-200 రూ.5.40, 201-300 రూ.7.10, 301-400 రూ.7.95, 401-500 రూ.8.50 ఛార్జి చేస్తారు
500 యూనిట్లకు మించి రూ.9.90 వసూలు చేస్తారు. గృహ వినియోగదారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.

ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు. 500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.