శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 జనవరి 2021 (17:58 IST)

ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు గవర్నర్ అభినందన

విజయవాడ: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ గబ్బా స్టేడియంలో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు సభ్యులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 2-1 స్కోరుతో సిరీస్ గెలిచి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవటం శుభపరిణామమన్నారు.
 
భారత క్రికెట్ జట్టు విజయానికి దేశం మొత్తం గర్విస్తుందని, ప్రజలంతా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. భారత క్రికెట్ జట్టు రూపంలో మువ్వన్నెల జెండా ప్రపంచ వినువీధులలో నిరంతరం ఎగురుతూనే ఉంటుందన్న ఆశాభావాన్ని గవర్నర్ శ్రీ హరిచందన్ వ్యక్తం చేశారు. భారత క్రికెట్టు జట్టు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.