బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:20 IST)

వైకాపా రంగు పోతోంది... ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధం

ration card
గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెందిన వైకాపా రంగులతో కూడిన రేషన్ కార్డులను జారీచేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తున్నప్పటికీ వైకాపా రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులపైనే సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కార్డులను తొలగించి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 
 
కొత్త కార్డులకు సంబంధించి అదికారులు పలు డిజైన్లను రూపొందించి, వాటిని పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతో పాటు మరికొన్ని డిజైన్లను కూడా ప్రభుత్వానికి పంపించారు. వీటిలో ఏదొ ఒక డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ రంగుతో డిజైన్ చేసిన కొత్త కార్డులను పంపిణీ చేస్తారు.