గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (15:06 IST)

మంత్రి రోజా మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు

Roja
Roja
నటిగా అడుగులు ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా రోజా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రిగా కొనుసాగుతోంది. అయితే ఇటీవల ఈమె అత్యంత ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
నివేదికల ప్రకారం, ఆర్కె రోజా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' యొక్క 'జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె కొన్న ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు అని, అంతే కాకుండా ఇది తన కొడుకు 'క్రిష్ణ కౌశిక్' కోసం కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడుద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రోజా తన కొడుకుతో ఈ జిఎల్ఎస్ కారుని డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. 
 
వీరు కొనుగోలు చేసిన ఈ కొత్త కారు వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. రోజా ఈ కారుని డ్రైవ్ చేస్తుండగా, తన కొడుకు తన పక్కనే కూర్చుని ఉండటం కూడా ఈ వీడియోలో గమనించించవచ్చు.