సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (10:26 IST)

ఫైర్ బ్రాండ్‌కు షాకిచ్చిన ఏపీ సీఎం జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు?

rk roja
ఏపీ సీఎం జగన్.. నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజా ఉన్నారు. ఈ పదవిలో కీలకంగా వ్యవహరించిన రోజాకు సీఎం జగన్ ఊహించని షాకిచ్చారు. ఆమెను పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు. 
 
బుధవారం వైసీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రకటించిన అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించగా.. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజాను తప్పించి ఆమె స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు బాధ్యతలు అప్పగించారు.
 
ఐతే రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆమెకు మహిళా విభాగం బాధ్యతను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.  
 
జులై 8న వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించి పార్టీ పదవులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కీలక పదవులను ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశముంది.